ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా

ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా

-రామగుండం టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ
ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించాలని, మరింత అభివృద్ధి చేస్తానని రామగుండం టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ అన్నారు. లింగాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగాపూర్ గ్రామస్థుల కష్టాలు తీరుస్తానని, భవిష్యత్ గ్రామాభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. సింగరేణి నుంచి రావాల్సిన డబ్బులు ఇప్పిస్తానన్నారు. ఆర్& ఆర్ ప్యాకేజీ, కాలనీ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా గ్రామస్థుల కోరిక మేరకు రాయదండి చెరువు నుంచి లింగాపూర్ లొని అవుసుల కుంట, ఊర కుంటకు సాగునీరు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. రైతు బంధు పథకంతో పాటు కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూస్తానన్నారు. ప్రతీ ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. మళ్లీ కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఇరికిల్ల పద్మ శంకర్, మాజీ సర్పంచి అర్షణ పల్లి మల్లీశ్వరి, శ్రీనివాస్, గ్రామ అభివృద్ధి కమిటీ నిమ్మ రాజుల రవి, వెంకన్న, గంగారపు వెంకటస్వామి, గ్రామ అధ్యక్షుడు అర్షనపల్లి రాజు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

somarapu satyanarayana 1      somarapu satyanarayana 2     somarapu satyanarayana 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *