
-పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఎన్నికల్లో ఆశీర్వదించి మరోసారి గెలిపించాలని, అండగా ఉంటానని పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లoపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళ హారతులు, కోలాటం, ఆటపాటలు, బతుకమ్మలు, బోనాలు, డప్పుచప్పుళ్లు, ఒగ్గుడోళ్లతో ఘనస్వాగతం పలికారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ నాలుగేళ్లలో అనేక ప్రయోగాలకు వేదికైందన్నారు. దేశంలోనే ప్రగతి శీల రాష్ట్రంగా ఆవిర్భవించిందన్నారు. ఢిల్లీలో ఉండి పాలించేంది ప్రభుత్వం కాదని, 24గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేదని అన్నారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నిరూపించిందన్నారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు, ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షుడు నల్ల నాగిరెడ్డి, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.