
హుజూరాబాద్ : 53 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న స్వచ్చంద మహిళా ఆరోగ్యకార్యకర్త ( ఆశ వర్కర్ల) ల డిమాండ్స్ ను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తానని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.అదివారం కరింనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ పథకం కోసం అయన భూమి పూజ చేసేందుకు వచ్చిన ఆయన తిరిగి వెలుతుండగా ఆశాల శిబిరం కనిపించింది. ఈ సందర్బంగా వారి శిభిరాన్ని సందర్శించి వారి సమస్యలు,అడిగి తెలుసుకున్నారు. వారితో 45 నిమిషాలపాటు వారితో చర్చించారు.త్వరలోనే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తానని అన్నారు.