ఆవేదనతో చెపుతున్నాఅర్థం చేసుకోండి …ప్లీజ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణా సమాజం ఎన్నెన్నో వివక్షలకు- అవమానాలకు గురయ్యిన తరువాత, అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటాల తరువాత, ఎందరో యువకుల బలిదానాల తరువాతనే ప్రత్యెక తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకున్నాము. మన పోరాటాన్ని ఒక ఆత్మా గౌరవ పోరాటంగా భావించాము  ప్రస్తుతం మనం సాధించుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి  చేసుకోడానికి మన వనరులపైన, కేంద్రప్రభుత్వం పైన ఆధారపడాలే  గాని సీమాంధ్ర సినిమా వాళ్ళ దయాదాక్షిణ్యాల కోసం మనం కానీ మన మంత్రులుకాని చెయ్యి చాపడం తెలంగాణా సమాజానికి అవమానకరం! మనకు ఉన్న వనరులను సరిగ్గా ఉపయోగించుకుంటూ అవినీతి అక్రమాలు జరగకుండా చూసుకుంటే మంచిది. తెలంగాణాలో జరగబోయే అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల నిర్వహణ కామేటి లో మళ్ళీ  సీమాంధ్ర సినిమావాళ్ళను చేర్చడం అవసరమా తెలంగాణా ప్రభుత్వానికి?  శ్రీమంతుడు  సినిమా విజయం అయ్యిందని అభినందిస్తూ పాలమూర్ జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోమని మన మంత్రి మహేష్ బాబును అడగవలసిన అవసరం ఏముంది ? తెలంగాణా ప్రభుత్వం నిర్మించబోయే సినిమా సిటీ కి హీరో
కృష్ణని డైరెక్టర్ గా  నియమిస్తాం అని ముఖ్యమంత్రి గారు ప్రకటించినప్పుడు తెలంగాణా సమాజం ఆశ్చర్య పోవడమే కాకుండా మనసుల్లో  ఎన్నో అనుమానాలు తలెత్తాయి! సీమంధ్ర సినిమా వాళ్ళ ఆస్తుల అక్రమాల గురించి అందరికి తెలిసిందే, గతంలో తెలంగాణా సాధించక ముందు వాటిపై మన ప్రముఖులు కేసులు పెట్టిన సంగతులన్నీ మనం వినే  ఉన్నాము, ఆ కేసులన్నీ
ఏమయ్యాయి? హైదరాబాద్ పట్టణం లో  విలువ గల భూములను ఆక్రమిన్చుకున్నవారిని వొదిలేసి వారినే  మన గ్రామాలను దత్తత తీసుకోమనడం ఆశ్చర్యకరం! అప్పుడు వారిని తిట్టిన నోర్లే ఇప్పుడు పోగుడుతున్నాయి! తెలంగాణా ఉద్యమానికి ఉపయోగపడ్డ వాళ్ళందరిని దూరం పెట్టి ఉద్యమానికి నష్టం చేకూర్చిన వాళ్ళందరిని ఎందుకు పంచన చేర్చుకుంటున్నారు?
తెలంగాణా సాధనకు ఉపయోగ పడ్డ మీరే తెలంగాణా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ, మీద్వారనే తెలంగాణకు అభివ్రుది చేకురుతుందనే  నమ్మకంతోనే   కదా తెలంగాణా ప్రజలు మిమ్ములను ఎన్నుకుంది ! అలాగే  మీరు కూడా తెలంగాణా ఉద్యమంలో అహర్నిశలు కృషిచేసిన వారికే ప్రాదాన్యత ఇవ్వాలి కదా ! మీరు ఈరకంగా ప్రవర్తిస్తారని ముందే తెలిస్తే మీరు ఈ స్థాయిలో ఉండేవారా ? తెలంగాణాను ప్రేమించేవారిని మీరు ప్రేమించండి! శక్తి సామర్ధ్యం ఉన్న తెలంగాణవాదులను తెలంగాణా నిర్మాణంలో భాగస్వాములను చేయండి. ప్రశ్నించే వారి ప్రశ్నలను అర్థం చేసుకొని సమస్యల పరిష్కారానికి  కృషి చేయండి కానీ వారి గొంతు నొక్కకండి! ఆలాంటి  వారి వల్లే మీకు తెలంగాణా సమాజం ఏమి కొరుకుంటుందో అర్థమవుతుంది. ఆ దిశలో పనిచేస్తేగాని ప్రజలమేప్పు మీకు దక్కదు ! తెలంగాణా సాధనలో ఉపయోగపడని వాళ్ళు తెలంగాణా అభివృద్ది కి
ఉపయోగపడలేరు, ఉల్టా మీకు, మీ ప్రభుత్వానికి చెడ్డపేరు తెడానికి కారకులుగా నిలబడుతారు.
ఇలాంటి వారిని ప్రోత్సహించినప్పుడు యెంత వద్దనుకున్నా ప్రభుత్వ పెద్దలపై ఎన్నెన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి! ఇట్లాంటి ప్రక్రియలవల్ల ప్రకటనలవల్ల  ప్రజలు ఆవేదన  చెందుతారు తప్ప ఆనందపడరు . కొందరు పదవుల్లో ఉండి, కొందరు పదవులపై ఆశ పెట్టుకొని, కొందరు భయపడి, కొదరు మీపై వెర్రి అభిమానం  తో ఏది చేసిన బరాబరే అనుకొని, కొందరు మీరు ఇట్లాంటి  ఇంకెన్నో తప్పులు చేయాలనీ కూడా తమ నోర్లు  తెరవరు. మా లాంటి వాళ్ళం తెలంగాణాను  ప్రేమించి తెలంగాణా అభివృద్ది కోరుకునేవాళ్ళం కాబట్టే ఇదంతా చెప్పవలసి వస్తుంది ! మీరు అర్థం చేసుకొని ప్రజల ఆకాంక్ష మేరకు నడిస్తే తెలంగాణకు మంచిది, మీకు మంచిది ! తెలంగాణవాదులుగా  ఈ  విషయాలు ప్రభుత్వానికి  సూటిగా సుతిమెత్తగా చెప్పడం మా కర్తవ్యంగా భావిస్తున్నాము.

– సయ్యద్ రఫీ (ఛైర్మన్, తెలంగాణా సినిమా ప్రొటెక్షన్ ఫోరం)

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.