Breaking News

ఆవు గుండెతో మనిషికి జీవం…

Cow-heart-to-woman

మనిషికి మనిషి గుండెనే కాదు.. గోవు గుండెను కూడా అమర్చవచ్చు. గోవు గుండెతో మనిషిని బ్రతికించవచ్చు.ఇది నిజం.చెన్నైలోని ఫ్రంటియర్ ఆసుపత్రిలో ఓ వృద్ధురాలికి గోవును గుండెను అమర్చారు. చావుబతుకులతో కొట్టుమిట్టాడిన వృద్ధురాలికి గోవు పునర్జన్మనిచ్చింది.ఆధునిక వైద్యశాస్త్రంలోనూతన అధ్యాయానికి తెరలేపింది చెన్నై ఫ్రంటియర్ హాస్పిటల్.హైదరాబాద్ కు చెందిన 81 ఏళ్ల వృద్ధురాలు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. 11 సంవత్సరాల క్రితం ఆమె గుండెకు శస్త్రచికిత్స చేసి వాల్వ్ ను అమర్చారు.కొంతకాలం బాగానే ఉన్నా.. ప్రస్తుతం ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది.చికిత్స కోసం దేశమంతా తిరిగి ఆఖరికి ఆమె చెన్నై వెళ్లింది. రెగ్యులర్ చికిత్సకు విరుద్ధమైన, చాలా ప్రమాదకరమైనా చికిత్సను చెన్నై వైద్యులు ఎంతో ధైర్యంగా చేశారు. ఆమెకు ఆవుగుండెను అమర్చి బ్రతికించారు. ఈ చికిత్స విజయవంతమైందని డాక్టర్లు ప్రకటించారు.గోమాతను పూజించాల్సిన కొందరు కబేళాలకు తరలించి .. చిత్రహింసలకు గురిచేస్తారు. తాను చనిపోయినా.. ఎన్నోరకాలుగా మనుష్యులకు ఉపయోగపడుతున్న గోమాత.. ఇప్పుడు తన గుండెకాయను ఇచ్చి మనిషికి ప్రాణం పోసింది.మరణించిన తరువాత ఎన్నోరకాలుగా ఉపయోగపడుతున్న గోమాత తన గుండె త్యాగంతో మనిషికి జీవం పోస్తోంది. అందుకే గోమాతను పూజించాల్సిన బాధ్యత మనది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *