ఆవినీతిపై కేసీఆర్ మొదటి చర్య

-వైద్య ఆరోగ్య శాఖ లో అక్రమాలపై చర్యలు
-ముగ్గురు అధికారులపై వేటు
హైదరాబాద్, ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వంలో అవినీతిని సహించేది లేదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలినాళ్లలో హుంకరించిన కేసీఆర్ అనుకున్నట్లే అవినీతికి పాల్పడిని ముగ్గురు వైద్యఆరోగ్య శాఖ అధికారులపై వేటు వేశారు. ఆ శాఖ సంచాలకులు సాంబశివరావు,  ఎన్ హెచ్ ఎం ముఖ్య పరిపాలనాధికారి శ్రీనివాసరెడ్డిని  కూడా ప్రభుత్వం తప్పించింది. అలాగే వరంగల్ లోని వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్టార్ గా నియమించి ఉస్మానియా ప్రొఫెసర్ బి.రాజును మూడురోజుల క్రితం తప్పించారు. ఈ మొత్తం సంఘటనలో ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్యపై ఆరోపణలు రావడం, దీనికి సంబంధించి నిఘా సంస్థలు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో  వరుసగా ముగ్గురు కీలక అధికారులను తొలగిస్తూ నేరుగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత ఏర్పడింది.

ఒక్క అంబులెన్స్ కు లక్ష నొక్కాబోయారు..
డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గా ఉన్న సాంబశివరావును , ఎన్.హెచ్.ఎం. శ్రీనివాసరెడ్డి లు కలిసి జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్  లో భాగంగా   290 అంబులెన్స్ ల కొనుగోలులో ఒక్కో వాహనానికి లక్ష రూపాయలు కమీషన్ గా తీసుకున్నారని సీఎం నిఘా విభాగం నివేదించింది. అలాగే జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా అవుట్ సోర్సింగ్ టెండర్ ఎన్.హెచ్.ఎం శ్రీనివాస్ రెడ్డి ఆయన బినామీ సంస్థకు కట్టబెట్టారు. ఇవన్నీ సీఎంకు నిఘా విభాగం అందజేసింది. దాంతో పాటు అక్రమంగా నియామకమైన ప్రొఫెసర్ రాజును వైద్యవిశ్వవిద్యాలయం విధులనుంచి తప్పించింది. ఈ ముగ్గురి అవినీతితో ఈ వ్యవహారం  డిప్యూటీ సీఎం రాజయ్య మెడకు చుట్టుకుంటోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *