
కొత్తపల్లి: చీకటిని తొలగించేటువంటి పండుగ మానవాళికి అష్ట ఐశ్వర్యాలను, సుఖ సంతోషాలను ప్రసాదించేటువంటి పండుగ దీపావళి పండుగ అని అల్ఫోర్స్ విద్యాసంస్ధల అధినేత శ్రీ.వి. నరేందర్ రెడ్డి గారు స్ధానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో మరియు ఐ.ఎ.ఎన్ అకాడమిలో నిర్వహించినటువంటి అల్ఫోర్స్ దీపావళి వేడుకలు మరియు బొమ్మల కొలువును సాంప్రదాయ బద్దంగా వేదమంత్రాల మధ్య జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీపావళి పర్వదినం చెడుమీద మంచి విజయానికి సూచిక అని మరియు నరకాసురిడిని వదించినటువంటి విధానం ద్వారా మానవాళికి పాపాల నుండి దూరంగా ఉండడానికి ఒక పాఠం లాంటిదని తద్వారా సమాజంలో నీతి, నిజాయితి స్ధాపించవచ్చని తెలిపారు. ప్రత్యేకంగా అష్టలక్ష్మిని ఆరాధించడం వలన ధన లాభమే కాకుండా, ఇతర లాభాలను సైతం సమకూర్చుకోవచ్చని చెప్పారు. దీపావళి అంటే టపాసులు పండుగ కాదని,
దీపాలతో సమాజానికి మంచిని బోధించేటువంటి, నీతిని చూపేటువంటి పండుగ అని కొనియాడారు. విద్యార్ధులు ప్రత్యేకంగా పర్యావరణాన్ని కాపాడడానికై, కాలుష్య నివారణకు చేయూతనివ్వడానికై టపాసులను కాల్చవద్దని శబ్దకాలుష్యాన్ని సైతం నివారించాలని పిలుపునిచ్చారు. విద్యార్ధులు సైతం తోటివారితోను పర్యావరణ పరిరక్షణకై పాటుపడాలని, సందేశం ఇవ్వాలని సూచించారు. వేడుకల సందర్భంగా విద్యార్ధులు దీపావళి మీద రచించినటువంటి పాటలను, నాటిక ప్రదర్శలను మరియు నృత్యాలను ప్రదర్శించారు. దీపావళి మానవాళికి ఒక వరం అని, దీపావళి వెలుగులు నింపే పండుగ అనే పాట మీద విద్యార్ధులు పదర్శించినటువంటి నృత్యం చాలా ఆకర్షింపజేసింది. సాంప్రదాయ బద్దంగా దీపావళి నాడు నిర్వహించేటువంటి బొమ్మలకొలువును ఆకర్షణీయమైనటువంటి దేవుని ప్రతిమలతో, బొమ్మలతో రంగోళీలతో అత్యంత దేదీప్యమానంగా ఏర్పాటు చేశారు. వేడుకలన పురష్కరించుకొని అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఫలవంచామృతం
విద్యార్ధులకు వితరణ చేశారు. ముందస్తు దీపావళి వేడుకలను అల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో విద్యాసంస్ధల అధినేత శ్రీ.వి. నరేందర్ రెడ్డి గారు ఘనంగా విద్యార్ధుల అద్భుత ప్రదర్శనల మధ్య ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్ధులు పాల్గొన్నారు.