ఆల్ఫోర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో హరితహరం

నేటి పోటీ ప్రపంచంలో మానవాళిక కాలుష్యం ద్వారా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని మరియు సుఖవంతంగా గడపలేకపోతున్నారని అల్ఫోర్ విద్యాసంస్ధల అధఇనేత శ్రీ వి. నరేందర్ రెడ్డి గారు స్ధానిక కొత్తపల్లిలోని అల్ఫోర్ గ్రూప్ ఆఫ్ స్కల్స్ వారి ఆధ్వర్యంలో స్ధానిక అల్ఫో్ర్స్ ఇ-టెక్నో స్కూల్ లో ఏర్పాటు చేసినటువంటి ‘‘హరితహరం’’ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెట్లను నరికివేయడం ద్వారా కాలుష్యం పెరుగుతున్నదని మరియు జనవనరులు, అటవి సంపద సైతం తరిగిపోతున్నదని తెలుపుతూ, ఇటువంటి దృశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి ప్రజలను మరియు పరిశ్రమలను నడిపేటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వృక్షాల యొక్క ప్రాముఖ్యతను ప్రతి విద్యార్ధి తెలుసుకొని మొక్కలు నాటడానికై స్వచ్చందంగా ముందుకు వచ్చి వాటి యొక్క సంరక్షణ బాధ్యతను భుజాన వేసుకొని సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచిస్తూ, విద్యార్ధుల చేత పాఠశాల ప్రాంగణంలో మొక్కలను నాటిపించారు. ఈ సందర్భంగా విద్యార్ధులు వాటి యొక్క సంరక్షణకై బాధ్యతను ప్రాధమికంగా నిర్వర్తించి ముందంజలో ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. హరిత హరంలో భాగంగా విద్యార్ధులు ఆలపించినటువంటి పాటలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఇంకా విద్యార్ధులు చేసినటువంటి నినాదాలు ఆలోచింపజేశాయి.

v.narender reddy

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *