ఆల్ఫోర్స్ లో క్విట్ ఇండియా వేడుకలు

భారతదేశం అత్యున్నత ప్రజాస్వామ్య దేశమని, మన దేశం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఆల్ఫోర్స్ విద్యాసంస్ధల అధినేత వి.నరేందర్ రెడ్డి అన్నారు. 70వ క్విట్ ఇండియా దినోత్సవ సందర్భంగా కొత్తపెల్లి లోని ఆల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో మంగళవారం జరిగిన గీతాలాపన కార్యక్రమానికి ఆయన హజరయ్యారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యంలో క్విట్ ఇండియా ఉద్యమం చాలా కీలకమైనదని తమ పాఠశాల 1000 మంది విద్యార్ధులతో జాతీయ గీతాలాపన చేయటం స్వాతంత్ర్య పోరాట వీరులకు ఘనమైన నివాళి అని అన్నారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్ విద్యార్ధులు ప్రదర్శించిన నాటిక పలువురిని ఆకట్టుకున్నది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *