ఆలోచన ఉంటే ఆరోగ్యం మీ చేతుల్లోనే… డాక్టర్ రాజా

హైదరాబాద్;- తెల్లారితేచాలు ప్రతి మనిషి జీవితంలో రుకులు..పరుగులు.. లక్ష్యసాధన వైపు వడివడి గా అడుగులు. ఫలితంగా శారీరక శ్రమతోపాటు మానసిక ఆందోళన, మస్తిష్కంపై ఎనలేని వత్తిడి తప్పడంలేదు. పెరుగుతున్న వాతావరణ కాలుష్యం..ఆహారపు అలవాట్లు.. ఇలా అన్నీ మానవులపై ప్రభావం చూపుతున్న తరుణంలో, ఏడాది పొడవునా విశ్రాంతి లేకపోవడం కూడా శారీరక, మానసిక దుష్పరిణామాలకు దారితీస్తున్నాయి. అందుకే ఏడాదిలో ఒక్కసారైనా మన కుటుంబ డాక్టర్ ను కలిసి శారీరక, మానసిక పరిస్ధితులను వివరించాలని ప్రముఖ కేన్సర్, రక్తనాళాల, స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ రాజా. వి. కొప్పుల సూచించారు. అమెరికా వంటి దేశాలలో సైతం ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని ఆయన వివరించారు. దీనివల్ల ప్రతిఒక్కరిపై వత్తిడి తగ్గి, సరైన సలహా పొందడంవల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన చెప్పారు.
ప్రత్యేక తనిఖీలు:- “అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసన్” ప్రత్యేకంగా కొన్ని రకాల శారీరక తనిఖీలను ప్రతిపాదించింది. ఏడాదికోసారి వీటిని చేయించుకుంటే కాన్సర్ వంటి రోగాలకు ముందే చికిత్స అందించవచ్చునని డాక్టర్ రాజా వివరించారు.
అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసన్ వారి ప్రతిపాదనల ప్రకారం దిగువ తనిఖీలు అవసరమని డాక్టర్ రాజా తెలిపారు.
1) 40 ఏళ్ల వయస్సు దాటిన స్ర్తీలు మేమోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి.

(2) గర్భసంచి పరిస్ధతిపై అవగాహనకు 40 ఏళ్లు దాటినవారు పాప్సిమియర్ పరీక్ష చేయించుకోవాలి.

(3) 50 ఏళ్లు దాటిన పురుషులు కోలనోస్కోపీ పరీక్షలు చేయించుకోవాలి. అదేవిధంగా ఎండోస్కోపీ పరీక్ష,  ప్రోస్పేట్ స్పెసిఫిక్ ఆంటిజన్ అనే పరీక్షలు చేయించుకుంటే వ్యాధులను ముందే  గుర్తించవచ్చునని డాక్టర్ రాజా సూచించారు. కాన్సర్ రావడానికి ముందు ఎటవంటి సింప్టమ్స్ ఉండవని, అందువల్ల ఒక వయస్సు వచ్చాక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన తెలిపారు.
వేసవిలో జాగ్రత్తలు :- పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..వాతావరణ పరిస్దితుల నేపధ్యంలో ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ రాజా సూచించారు.  ధూమపానం వల్లే అత్యధిక రోగాలు వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.  మద్యపానం పరిమితంగానే ఉండాలని,  అధికమైతే విపరీత పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఎలాంటివారైనా రోజుకు 20 నుంచి 40 నిమిషాలపాటు వ్యాయామం చేయాలని ఆయన తెలిపారు.

వయస్సు, ఆరోగ్య పరిస్ధితులను బట్టి వారికి తగ్గట్టు పరిమితి ప్రకారం వ్యాయామం తప్పనిసరిగా చేయాలని దీనివల్ల అత్యధిక రోగాలకు దూరంగా ఉండవచ్చనని వివరించారు. నడక మొదలుకొని యోగా, ఇతర వ్యాయామాలు చేయడం ద్వారా ఆరోగ్యాన్పి పరిరక్షించుకోవాలన్నారు. శరవేగంగా మారుతున్న చికిత్సా విధానాలపై అవగాహన పెంచుకోవాలని ఫలితంగా అరోగ్యం పై చేసే వ్యయాన్ని నియంత్రించుకోవచ్చునని చెప్పారు. వైద్యానికి సంబంధించిన సూచనలకోసం తమ ఎవిస్ హాస్పిటల్ హైదరాబాద్ కు చెందిన సెల్ నెంబర్లు 9909677715 లేదా 9989527715 కు ఫోన్ చేయవచ్చునని తెలిపారు. ఒక నిర్ధిష్ట ఆలోచన ప్రకారం వైద్యపరంగా ముందుకు వెళ్తే మంచి ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుందని, ఆరోగ్య భారతావని వర్దిల్లుతుందని డాక్టర్ రాజా అభిప్రాయపడ్డారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *