
నల్గొండ జిల్లా ఆలేరు పోలీస్ స్టేషన్ లో పోలీసులు మందు పార్టీ చేసుకుని చిందేశారు. తీన్మార్ పాటలతో ఊర్రూతలూగించారు. నాటుసారా బట్టీల నిర్వాహకులతో కలిసి ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే ఇలా చేయడం వివాదాస్సదమైంది. నల్గొండ జిల్లా ఆలేరు హెడ్ కానిస్టేబుల్ మైసయ్య బదిలీ సందర్భంగా ఈ వీడ్కోలు పార్టీ జరిగింది. ఈ సందర్భంగా మద్యం మాఫియా ఇచ్చిన ఈ విందుకు పోలీసులు ఫుల్లుగా తాగి ఆలేరు ఠాణాలో పార్టీ చేశారు. ఈ విందులో మైసయ్యతో పాటు కానిస్టేబుల్ , హెడ్ కానిస్టేబుల్ లు ఈ పార్టీలో ఫుల్లుగా ఎంజాయ్ చేశారు.