Breaking News

ఆలస్యమే అమృతం!

arvind-kejriwal-bedi-0L

ఢిల్లీ ఆప్ ఝాడూ జాదూ పని చేసిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఏడాది క్రితం జీరోగా బద్నాం అయిన కేజ్రీవాల్ ఇప్పుడు హీరోగా మారడానికి చాలా పరిణామాలు కలిసి వచ్చాయి. ఎన్నికల నిర్వహణ ఆలస్యమయ్యే కొద్దీ ఆప్ బలపడటానికి వీలు చిక్కింది. ఢిల్లీ సీఎం పదవికి ఒకప్పుడు 49 రోజులకే రాజీనామా చేయడం, లోక్ సభ ఎన్నికల్లో ఆప్ దారుణంగా దెబ్బతినడం, వారణాసిలో మోడీ చేతిలో కేజ్రీవాల్ ఓడిపోవడం…ఇలా ఏరకంగా చూసినా ఆప్ కి చేదు అనుభవాలే ఎదురయ్యాయి.

మే నెల తర్వాత ఢిల్లీ ఎన్నికలు ఎప్పుడైనా జరగవచ్చనే ఉద్దేశంతో కేజ్రీవాల్ చక చకా పావులు కదిపారు. గల్లీ గల్లీ కార్యకర్తలను సమీకరించారు. ఎన్నికల ప్రచారం తరహాలో ఆప్ కార్యకర్తలు చురుగ్గా జనంలో కలిసిపోయారు. రాజీనామా చేసినందుకు పశ్చాత్తాపాన్ని ప్రకటించిన కేజ్రీవాల్, ఈసారి అలా చేయనంటూ పదే పదే లెంపలు వేసుకున్నారు. నిజాయితీ పరులకు అవకాశం ఇవ్వండి అంటూ గత ఏడెనిమిది నెలలుగా ఆప్ కార్యకర్తలు గల్లీల్లో, ఆన్ లైన్లో ప్రచారం చేశారు.

ఎన్నికల నిర్వహణపై కేంద్రం తాత్సారం చేయడం ఆప్ కి కలిసి వచ్చింది. సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలో తేల్చుకోలేక బీజేపీ సతమతం అయింది. చివరికి కిరణ్ బేడీని రంగంలోకి దింపాలని నిర్ణయించింది. అది మంచి నిర్ణయమే అయినా… కార్యకర్తలు కళ్లు మూసి తెరిచే లోగా ఆమె పార్టీలో చేరడం, సీఎం అభ్యర్తి కావడం జరిగిపోయాయి. ఢిల్లీ నాయకులు కొందరికి ఇది నచ్చలేదు. అందరినీ కన్విన్స్ చేసిన తర్వాత బేడీని ప్రకటించి ఉంటే బాగుందేడి. అంతా  హడావుడి అయోమయంగా జరిగిపోయింది. ఇది కూడా బీజేపీకి నెగెటివ్ ప్రచారాన్ని ఇచ్చింది.

బీజేపీ ఆలస్యంగా ప్రచార రంగంలోకి దిగడం కూడా ఆప్ కే కలిసి వచ్చింది. మొత్తానికి… ఆప్ సొంత బలం కన్నా, బీజేపీ చేసిన ఆలస్యమే చీపురు కట్ట కు బలాన్నిచ్చింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *