
అసలే న్యూఇయర్. దాంతో పాటు ముక్కోటి ఏకాదశి. స్వామి వారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు గుళ్లకు క్యూలు కడుతున్నారు. రాష్ట్రంలోని ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. భద్రాచలం, వేములవాడ, యాదగిరిగుట్టతో పాటు రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భద్రాచలం రామనామ స్మరణతో మార్మోగుతోంది. ఉత్తరద్వారం నుంచి స్వామి వారి దర్శనమిస్తున్నారు. యాదగిరిగుట్టలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. తిరుపతి, శ్రీశైలం ఆలయాలకు భక్తులు భారీ సంఖ్యలోనే వస్తున్నారు. వీఐపీ పాసులు ఎక్కువగా ఇవ్వడంతో సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. క్యూ లైన్లలో భక్తులు గంటలకు పైగా వెయిట్ చేస్తున్నారు.