ఆర్ కే లక్ష్మన్ కు గూగుల్ డూడుల్

ప్రముఖ కార్టూనిస్ట్ లక్ష్మన్ కు గూగుల్ ఘనంగా నివాళులర్పించింది. లక్ష్మన్ 94వ జయంతి సందర్భంగా గూగుల్ డూడుల్ ను గూగుల్ సెర్చ్ ఇంజిన్ పై పెట్టింది.. లక్ష్మన్ ఒక టేబుల్ పై కార్టూన్ లు వేస్తున్నట్టు ఒక చిత్రం.. వెనుకలా సామాన్యుడు పేపర్ చదువుతున్న కార్టూన్, పక్కన బల్లా పై పుస్తకాలు అమర్చి ఒక మంచి కార్టూన్ ను ప్రచురించింది..

లక్ష్మన్ 2015, జనవరి 26న కన్నుమూశారు. 1921 అక్టోబర్ 24న మైసూర్ లో జన్మించారు. కామన్ మ్యాన్ పాత్రను సృష్టించి దానికి తన వ్యంగ్య చిత్రాల్లో స్థానం కల్పించిన లక్ష్మన్ సామాన్యుడి పాత్రతో ఎన్నో కార్టూన్ లు వేశాడు.. తన వ్యంగ్య చిత్రాలతో రాజకీయాల్ని తూలనాడాడు. సంచలనాలు రేపాడు.

లక్ష్మన్ కు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పద్మ విభూషన్, మెగసెసే అవార్డులు వరించాయి.. ప్రముఖ రచయిత ఆర్ కే నారాయణ్ సోదరుడే లక్ష్మణ్.. కార్టూనిస్ట్ లకు గాడ్ ఫాదర్ లాంటివాడు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *