
నిజామాబాద్ : ఆర్మూర్-నిజామాబాద్ నూతన రైల్వే లైన్ పనులకు నిజామాబాద్ ఎంపీ కవిత భూమిపూజ చేశారు. ఎంపీ కవిత మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాను గత పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ పనులను తొందరగా పూర్తి చేసి నిజామాబాద్ ప్రజల కళ నెరవేరుస్తామన్నారు.
తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే చంద్రబాబు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఇక ఆంధ్రావారి ఆటలు తెలంగాణలో సాగవన్నారు.