
ఆర్మూరు, జగిత్యాల మధ్య గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని *రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. శనివారం సచివాలయంలో తన ఆఫీసు లో సంబంధిత అధికారులతో సమీక్షా నిర్వహించారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా రహదారిని ఆధునీకరణ లో భాగంగా నిర్మించాలని ఆదేశించారు. రాయపట్నం బ్రిడ్జి సమీపంలో గల రహదారి నిర్మాణం కోసం పలు ప్రతిపాదనలను రూపొందించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే తుది రూపును ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. ఎక్కువ సంఖ్యలో రైతులకు నష్టం కలుగకుండా భూసేకరణ చేపట్టాలని జగిత్యాల ఆర్డీవో గంట నరేందర్ ని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశం లో ప్రాజెక్ట్ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ , ఈ రహదారి నిర్మాణానికి సంబంధిత కన్సల్టెన్సీ లు పాల్గొన్నారు.