
ఆర్టీసీ బస్సుల్లో ఇక నుంచి ఇంటర్ నెట్ ను ఎంజాయ్ చేయొచ్చు.. బస్సు ఎక్కిన్పప్పటినుంచి దిగేవరకు వెబ్ విహారంతో బోర్ కొట్టకుండా ప్రయాణం చేయొచ్చు.. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఇక పై వైఫై సౌకర్యాన్ని ఏర్పాుట చేసేందుకు రెడీ అవుతోంది ఆర్టీసీ యాజమాన్యం.. ఏప్రిల్ 1 నుంచి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దీనివల్ల నష్టాల్లో ఉన్న ఏపీ ఆర్టీసీని గట్టెక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా విజయవాడ-హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లే గరుడ, వెన్నెల, బస్సుల్లో దీన్ని అమలు చేయనున్నారు. ఇది సక్సెస్ అయితే మరిన్ని ప్రాంతాలకు వెళ్లే బస్సులకు ఈ సౌకర్యం కల్పిస్తారు.
మొదట గంటపాటు ఉచితంగా వైఫై ఇస్తారు. ఆ తరువాత కూడా ఉపయోగించుకోవాలనుకుంటే రూ.10 చార్జీతో ప్రయాణం ముగిసే వరకు ఇంటర్ నెట్ ను ఉపయోగించుకోవచ్చు. ఏపీలో ఉన్న ప్రైవేటు బస్సుల నుంచి వస్తున్న పోటీని ఎదుర్కోనేందుకు ఆర్టీసీ అధికారులు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.