ఆర్టీఏ ఆధునీకరణకు అంతర్జాతీయ ప్రమాణాలతో స్వంత భవనాలు

ఆర్టీఏ ఆధునీకరణకు అంతర్జాతీయ ప్రమాణాలతో స్వంత భవనాలు

 

ఆర్టీసీ కోసం ప్రభుత్వానికి 1064.72 కోట్ల ప్రతిపాధనలు

అక్రమ రవాణా, ఓవర్ లోడ్ ను ఉపేక్షించేదిలేదు

సింగిల్ పర్మిట్ మీద ఏపితో మరో మారు చర్చలు

శివరాత్రికి భక్తుల కోసం 800 ప్రత్యేక సబ్సులు

రవాణా శాఖ సమిక్ష,

వీడియో కాన్పరెన్స్ లో మంత్రి మహేందర్ రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 20 : రాష్ట్రంలో అన్ని ఆర్టీఏ కార్యాలయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు సంత భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించేదుకు బడ్డెట్ ప్రతిపాధనలు చేస్తామని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం రవాణాశాఖ కేంద్ర కార్యాలయం ట్రాన్స్ పోర్ట్ భవన్ లో ఆర్టీఏ, ఆర్టీసీ అధికారులతో 2017-18 బడ్డెట్ ప్రతిపాధనల మీద సమిక్షించి, వీడియో కాన్ఫరెన్న్ నిర్వహించారు. రానున్న బడ్జట్ రాష్ట్రంలోని అన్ని రవాణా కార్యాలయాలకు అవసరమైన భవనాల నిర్మాణాలు, ఐటీ సేవల వినియోగం, సిబ్బంది, సదుపాయాలు తదితరాల కల్పన కోసం చర్చించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని రవాణాశాఖకు కనీసం 167 కోట్ల నిధులు అవసరం అవుతాయని ఇది గత ఏడాది కంటే 88.24 కోట్లు ఎక్కువన్నారు. ఇందులో పెండింగు భవనాల నిర్మాణాలు, ఫర్నీచర్, ఇతర సదుపాయాలకు పూర్తి చేసేందుకు 30 కోట్ల నిధులు మంజూరుకు ప్రతిపాదించారు.రాష్ట్రంలో రవాణా శాఖ 25 లక్షల స్మార్ట్ కార్డులను లైసెన్స్ లు, ఆర్సీ ల రూపంలో జారీచేస్తుందని ఇందుకు గాను 15 కోట్లనిధులు అవసరమవుతాయన్నారు. తాండూర్ లో రెండు కోట్ల నిధులతో రవాణాశాఖకు నూతన భవనం , సిబ్బంది నియామకాల కోసం మంత్రి ఆదేశించారు. అలాగే ఆర్టీసీ కోసం 1064 కోట్ల నిధుల ప్రతిపాధనలు చేశామన్నారు. ఇందులో 140 కోట్ల నిధులతో ప్రజా రవాణా బలోపేతం చేసేందుకు కొత్త బస్సులను కొనుగోలు చేస్తామని, వివిధ రకాల బస్ పాస్ ల తాలూకు ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీల కోసం సంస్థ కు 590 కోట్లు, ప్రభుత్త గ్యారంటీ లోన్ ను తిరిగి చెల్లించేందుకు మరో 334.72 కోట్ల నిధులు ప్రతిపాదిస్తున్నామన్నారు. బడ్చెట్ లో బస్ స్టాండ్ల లో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని, సర్వీసులు సంఖ్య ను పెంచుతామని స్పష్టం చేశారు. ఆర్టీసీకి గత ఏడాది 633.16 కోట్ల
Page 2 of 2కేటాయింపులు రాగా వీటిలో 482.83 కోట్లనిధులు అందాయని ఈసారి భారీగా నిధులు రాబట్టు కునేందుకు సీఎం కేసీఆర్ కు విన్నవిస్తామన్నారు. శివరాత్రికి భక్తు కోసం 800 ప్రత్యేక బస్సులు పవిత్రి శివరాత్రికి శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తులకు కోసం టీఎస్ ఆర్టీసీ 800 ప్రత్యేక బస్సులను నడిపిస్తుందని రవాణా మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా మహాబూబ్ నగర్ , రంగారెడ్డిలలోని కీసరగుట్టకు 300 ఇతర ప్రాంతాలకు 150 బస్సులు, కాళేశ్వరంకు 150, వేముల వాడకు 200, ఏపీలోని శ్రీశైలంకు 150 ప్రత్యేక బస్సులను నడుపుతామని అందుకు పర్యవేక్షణ అధికారులు ఎండీ రమణారావు నిమమిస్తారన్నారు. సింగిల్ పర్మిట్ల కోసం ఏపీతో మరో మారు చర్చలు రాష్ట్రంలోని లారీ యజమానులు శ్రేయస్సు కోసం సింగిల్ పర్మిట్ మీద ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో మరో్ మారు చర్చిస్తామని రవాణా మంత్రి మహేందర్ రెడ్డి స్పష్ఠం చేశారు. రాష్ట్ర లారీ ఓనర్స్ అసోషియేషన్ నాయకులు మంత్రిని కలిసిన నేపథ్యంలో గతంలో రెండు సార్లు ఏపీ తో చర్చించామని, తమ ప్రతినిధులు ఏపీ సీఎంను కలిశారని అయితే వారు ఇందుకు ముందుకు రాకపోవటం దురదృష్టకరమన్నారు. రవాణా శాఖ ప్రిన్స్ పుల్ సెక్రటరీ సునీల్ శర్మను మరో మారు ఏపీతో సింగిల్ పర్మిట్ మీద సంప్రదించాలని ఆదేశించారు. అయితే రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనే అక్రమ రవాణా, ఓవర్ లోడ్ విధానాన్ని సహించరాదని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. ఎంతటి వారినైనా సహించేదిలేదని, ఉపేక్షించరాదని చెప్పారు.సునీల్ శర్మతో పాటు జేటీసీలు వెంకటేశ్వర్లు, డీటీసీలు రమేష్, దశరత్, సుధాకర్ రెడ్డి, కృష్ణాకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Find in document
ఆర్టీఏ ఆధునీకరణకు అంతర్జాతీయ ప్రమాణాలతో స్వంత భవనాలు.docx
Open with Google Docs
Page 1 of 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *