ఆరోగ్యమే మహభాగ్యం: మంత్రి పోచారం

ఆరోగ్యవంతమైన సమాజం కావాలంటే ప్రజలు ఆరోగ్యమైన, తాజా ఆహరం తీసుకోవాలని రాష్ట్ర్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పోచారం శ్రీనిపాసరెడ్డి తెలిపారు. ఈరోజు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో ‘‘తెలంగాణ ఉధ్యాన మహోత్సవం -2017’’ ను మంత్రి పోచారం
ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజలు తమ ఇంటికి అవసరమైన కూరగాయలను ఇంట్లోనే పండించుకోవాలన్నారు. పురుగు మందులు వాడకుండా సేంద్రియ పద్దతులను ఆచరించి తాజా కూరగాయలను పండించుకోవాలని సూచించారు. ఇళ్ళలోనే
కూరగాయలు పండించడానికి అవసరమైన అధునాతన, సాంకేతిక పద్దతులను రాష్ట్ర్ర ఉధ్యానవన శాఖ అందుబాటులోకి తెచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర్రానికి అవసరమైన కూరగాయలు, పండ్లను మన రాష్ట్ర్రంలోనే పండించడమే కాకుండా ఎగుమతి చేసే స్ధాయికి ఉత్పత్తులు చేరాలన్నారు.
ఉధ్యాన పంటల ద్వారానే రైతులు అధిక ఆదాయం పొందుతారన్నారు. అందుకే రాష్ట్ర్ర ప్రభుత్వం భారీగా రాయితీలను కల్పించి ఉధ్యాన పంటల రైతులను ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్ర్రంలోని 10800 రెవిన్యూ గ్రామాలను 3600 యూనిట్స్ గా విభజించి సెస్టెంబర్ 1 నుంచి 9వరకు గ్రామ రైతు
సమన్వయ సంఘాలను ఏర్పాటు చేసి రీసోర్స్ పర్సన్స్ ద్వారా సదస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. రైతు సమగ్ర సర్వే వివరాలను పూర్తి స్ధాయిలో పరిశీలించి సమన్వయకర్త aeo సంతకాలతో కూడిన రికార్డు ఆధారంగా వచ్చే ఏడాది మే 15 నాటికి ఎకరాకు 4000 రూపాయల నగదును
రైతుల ఖాతాలలోకి బదిలీ చేస్తామన్నారు. రెండు పంటలు పండించే ఉధ్యాన రైతులకు ఏడాదికి 8000 నగదు అందుతుందన్నారు. రైతులు అప్పుల బారి నుండి బయటపడాలని, ఆత్మహత్య రహిత తెలంగాణాయే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్పాపూర్ శాసనసభ్యుడు మదన్
నారాయణఖేడ్ శాసనసభ్యుడు భూపాల్ రెడ్డి, డైరి డవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమా రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ సెక్రటరీ పి పార్ధసారధి -IAS, ఉధ్యానశాఖ కమీషనర్ యల్ వెంకట్రామి రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ఉధ్యాన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు
చేసిన ఈ 5 రోజుల మహోత్సవం ఈ నెల 31వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రభుత్వ, ప్త్ర్రెవేటు సంస్ధలు తమ ఉత్పత్తులతో కూడిన స్టాళ్ళను ఏర్పాటు చేశారు.

pocharam     pocharam..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *