ఆరు నెలల్లో తుమ్మిళ్ల లిఫ్ట్ పూర్తి : మంత్రి హరీష్ రావు

.

 

సి.ఎం.కేసీఆర్ తో ప్రారంభోత్సవం.

దశ తిరిగిన పాలమూరు

ఆర్.డి.ఎస్.కు పూర్వ వైభవం.87,500 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ప్రయత్నం.

రాజకీయాలు ముఖ్యం కాదు. రైతుల ప్రయోజనాలే ప్రాధాన్యం.

మల్లమ్మకుంట,వల్లూరు, జూలకల్లు రిజర్వాయర్ లు మంజూరు.

“తుమ్మిళ్ల లిఫ్ట్ కింద వచ్చే వానాకాలం నీళ్లిస్తాం.నేను

ప్రతి నెలా వస్తా.ఆరు నెలల్లో పూర్తి చేస్తాం.

ముఖ్యమంత్రి కేసీఆర్ తుమ్మిళ్ల లిఫ్టు ను ప్రారంభిస్తారు.ప్రాజెక్టు అంటే పదేళ్లు అనేది గత ప్రభుత్వాల మాట. ఇది టి ఆర్ ఎస్ ప్రభుత్వం. వేగంగా పని చేస్తాం.ప్రాజెక్టు పనులను ఫాస్ట్ ట్రాక్ కింద నడిపిస్తాం.ఆర్.డి.ఎస్.కు పూర్వ వైభవం తీసుకు వస్తాం.87,500 ఎకరాలను సాగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు.

ఆర్.డి.ఎస్.కోసం 2002  లో ఉద్యమ నాయకుడిగాకేసీఆర్ పాదయాత్ర చేశారు. నడిగడ్డ ప్రజలు, రైతుల కష్టాలు స్వయంగా చూసి చలించిపోయారు. ఆ పాదయాత్రలో మేమందరం ఉన్నాం.ఇన్నేళ్ల తర్వాత తెలంగాణ వచ్చింది.

ఉమ్మడి ఏ.పి.లో తెలంగాణ ప్రాంతంతీవ్ర నిర్లక్ష్యానికి గురైందనడానికి ఆర్.డి.ఎస్.సాక్ష్యం.65 టి.ఎం.సి.ల కేటాయింపులు ఉంటేఆర్.డి.ఎస్.కు చివరికి 5 టి.ఎం.సి.లకు మించినీరురాలేదు.తెలంగాణ రాకపోతే, కేసీఆర్ సి.ఎం.కాకుంటే తుమ్మిళ్ల వచ్చేది కాదు. పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టు లనుపరుగెత్తిస్తున్నాం.కల్వకుర్తి ప్రాజెక్టు దగ్గరే ఒక రాత్రి పడుకున్నాము.ఆవంచ అక్విడెక్ట్ దగ్గర ఆ గ్రామంలో నిద్రపోయాము. ఆవంచ అక్విడెక్ట్ ను పూర్తి చేయించామన్నారు మంత్రి హరీష్ రావు.

మండుటెండలో పనిచేశామ్.కాల్వల వెంట తిరిగాము.కాంగ్రెస్ హయాంలో 95 శాతం పాలమూరు ప్రాజెక్టు ల పనులు పూర్తయినట్టు కాంగ్రెస్ నాయకులు చేస్తు న్న ప్రకటనలు బూటకం.95 శాతం కల్వకుర్తి పూర్తయితే కేవలం 13 వేల ఎకరాలకు సాగునీరు ఎందుకిచ్చారు. మేము వెంటబడి భూసేకరణ, స్ట్రక్చర్స్ నిర్మాణం, ఇతర అన్ని పనులను వేగవంతం చేసి

కల్వకుర్తినుంచి 2016లోరెండున్నర లక్షల ఎకరాలకు నీరిచ్చాం.మేము హెలికాప్టర్ నుంచి కిందకుచూస్తేఏ చెరువు, చూసినా నీరే.ఏ కుంట చూసినా నీరే. పాలమూరు జిల్లా పచ్చగా కన్పిస్తుంది.

పాలమూరులో కొత్తగా 4.50 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చాం.ఇదంతా సి.ఎం.కేసీఆర్ దూరదృష్టి ఫలితం.మిషన్ కాకతీయ తో చెరువులను పునరుద్ధరిస్తాం.గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాల రైతాంగం కోసం రిజర్వాయర్ లు కావాలనిఎం.పి.జితేందర్ రెడ్డి,మాజీఎం.పి.జగన్నాథం,నిరంజన్ రెడ్డి గట్టిగా పట్టుబట్టడంతో

మల్లమ్మకుంట,వల్లూరు, జూలకల్లు రిజర్వాయర్లనుమంజూరు చేసాం.ఆలంపూర్ లో ఎం.ఎల్.ఏ కాంగ్రెస్ వారైనా మాకుప్రజలుముఖ్యం.వాళ్ళు తెలంగాణ బిడ్డలు.తెలంగాణ ప్రజల ప్రయోజనాలే మాకు ప్రాధాన్యం.కొల్లాపూర్, గద్వాల, ఆలంపూర్ లలో ఉల్లిగడ్డ ధరలు పూర్తిగా తగ్గిపోయినపుడు నేరుగా రైతులదగ్గరకే వెళ్ళి ప్రభుత్వం కొన్నది.ఆ రైతులనుఆదుకున్నాం.మార్కెటింగ్గోడౌన్ల సామర్ధ్యం పెంచాం.18 కోట్లు ఖర్చు చేసి 30 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గద్వాల ప్రాంతంలోగోడౌన్లు నిర్మించాం.తుంగభద్రలో తెలంగాణకు కేటాయించిన నీటిని తమకు ఇవ్వాలని, తమకు నీటి కొరత ఉందని కర్ణాటక కోరింది.నేను ఆర్.డి.ఎస్.గురించి వారిని నిలదీశాను.ఆర్.డి.ఎస్.

ఆధునీకరణ పనులను పూర్తి చేసేందుకు సహకరిస్తామని కర్ణాటక ఇరిగేషన్ మంత్రి పాటిల్ తెలంగాణకు హామీ ఇచ్చారు.ఆలంపూర్ లో శెనగలకు మద్దతు ధర లభించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం.

వచ్చే ఖరీఫ్ నుంచి పంట పెట్టుబడుల కోసంప్రతి ఎకరానికి 8 వేల రూపాయలు ఎలా ఇవ్వాలి?చెక్కు,లేదా నగదు ఇవ్వాలని రైతులు మెజారిటీ అభిప్రాయ పడుతున్నారు.రైతులు కొరినట్లే ఇస్తాం.రైతులకు మేలు చేయడం మా లక్ష్యం.రైతు సంక్షేమ ప్రభుత్వం.గతంలో లంచాలు ఇవ్వనిదే ట్రాన్స్ఫార్మర్స్ మంజూరు అయ్యేవి కాదు.కొత్త వ్యవసాయ కనెక్షన్ల కోసం లంచం ఇవ్వవలవచ్చేది.

గత ప్రభుత్వ హయాంలో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు. ఇప్పుడా సమస్య లేదు. లంచాలు లేవు.రైతులు అడిగిన వెంటనే ట్రాన్స్ఫార్మర్లు,సబ్ స్టేషన్లు మంజూరు చేస్తున్నాం.” అని చెప్పారు మంత్రి హరీష్ రావు.

IMG-20180108-WA0140 IMG-20180108-WA0127 IMG-20180108-WA0132 IMG-20180108-WA0142 IMG-20180108-WA0128 IMG-20180108-WA0131

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *