
ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం
హైదరాబాద్ , ప్రతినిధి : ఎప్పుడెప్పుడా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన తెలంగాణ తొలిమంత్రి వర్గ ఎట్టకేలకు పూర్తయ్యింది.. విస్తరణలో ఆరుగురు టీఆర్ఎస్ నాయకులు మంత్రి పదవులను స్వీకరించారు. రాజ్ భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం జరిగింది. కొత్త మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు.
ప్రమాణం చేసిన వారిలో ..
1.తుమ్మల నాగేశ్వరరావు(ఖమ్మం జిల్లా, 4సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి మంత్రిగా అనుభవం),
2. ఇంద్రకరణ్ రెడ్డి – (ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గం, 3 సార్లు ఎమ్మెల్యేగా, 2సార్లు ఎంపీగా అనుభవం) ,
3.తలసాని శ్రీనివాస్ యాదవ్- ( హైదరాబాద్, సనత్ నగర్ నియోజకవర్గం, 4సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రి గా అనుభవం),
4.లక్ష్మారెడ్డి – (మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా అనుభవం)
5.అజ్మీరా చందులాల్ – (ములుగు, వరంగల్ జిల్లా,ములుగు నియోజకవర్గం 2 సార్లు.. ఎమ్మెల్యే 2 సార్లు ఎపీగా అనుభవం),
6.జూపల్లి కృష్ణారావు-మహబూబ్ నగర్ జిల్లా, కొల్లాపూర్ నియోజకవర్గం, 5 సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రిగా అనుభవం)లో వున్నారు.
ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.