ఆయన వల్లే నీకీ ఖర్మ పట్టుకుంది..

chiru-satires-on-babu parakala

ఏపీ ప్రభుత్వంలో ఇప్పుడు మొత్తం ఆయన పాలనే నడుస్తోంది.. ఆయనంటే చంద్రబాబు కాదు.. ఆయన ఏరికోరి తెచ్చుకున్న ‘విచ్చిన్న కారుడు’ ప్రస్తుత సలహాదారుడు.. రాజమండ్రిలో చంద్రబాబు గుడ్డిగా నమ్మి సలహాదారుకు బాద్యతలు అప్పగిస్తే.. ఆయన మొండి వైఖరితో రాలిన 37 ప్రాణాలకు బలితీసుకుంది ఆ సలహాదారుడేనట.. ఆయనను నమ్మి గుడ్డిగా ముందుకెళ్తున్న చంద్రబాబు మున్ముందు మరిన్ని కష్టాలు ఎదుర్కోక తప్పదంటున్నారు ప్రతిపక్షాలు.. టీడీపీ నేతలు..

ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ఇఫ్పుడు ఏపీ ప్రభుత్వ వ్యవహారాలను శాసిస్తున్నారు. ఈ విషయంలో రాజమండ్రి మృతుల నేపథ్యంలో కాంగ్రెస్ నేత, సినీ నటుడు చిరంజీవి స్వయంగా చెప్పారు. ఆయనను గుడ్డిగా నమ్మి ముందుకెళ్తున్న చంద్రబాబు అసమర్థుడని.. తగిన మూల్యం చెల్లించుకుంటాడని ధ్వజమెత్తాడు. కాగా పరకాల డామినేషన్ ఎక్కువవుతుందని టీడీపీ మంత్రులు కుమిలిపోతున్నారట..

మరో వైపు కేంద్ర మంత్రి విమలా సీతారామన్ భర్త అయిన పరకాల ప్రభాకర్ వల్ల ఏపీకి నిధుల వస్తాయని చంద్రబాబు ఎత్తుగడ వేసి ఆయనను సలహాదారుగా నియమించుకొని విదేశాలకు, ప్రభుత్వంలో భాగస్వాములను చేశాడు. దీని వల్ల ఆయన అతిజోక్యం.. అనుభవరాహిత్యంతో ప్రభుత్వం విమర్శల పాలవుతోంది.

‘‘కాగా ప్రజారాజ్యం పార్టీని విచ్చిన్నం చేయడంలో ఆ పార్టీని అభాసుపాలు చేయడంలో పరకాల కంకణం కట్టుకొని నాశనం చేశాడు.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో కూడా కీరోల్ వహిస్తూ రాజమండ్రి మృతుల వంటి దారుణాలకు కారణమయ్యాడు. ఇంకా ఎన్ని ఘోరాలు చంద్రబాబు చవిచూస్తావ్..’’ అంటూ చిరంజీవి ప్రశ్నల వర్షం కురిపించాడు.. చంద్రబాబు మేలుకుంటాడో.. కంటిన్యూ చేస్తాడో చూడాలి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *