
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్టీఆర్ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెరగని ముద్ర వేసింది వైఎస్ ఆరే.. అంతటి మహానేత.. బలమైన నేత ఏపీలో మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు..ఆయన ప్రతిపక్షాలను తుత్తునియలు చేశాడు.. ఎవరినీ నిలదొక్కుకోనీయలేదు… ప్రతిపక్షాలు అసలు పోటీలోనే లేకుండా పార్టీలను చీల్చిపారేశాడు..
వైఎస్ వేసిన వ్యూహాలకు కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీయే లేకుండా పోవాల్సిన పరిస్తితి ఏర్పడింది. ముఖ్య నేతలంతా కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యేలు వలస బాట పట్టారు. ఏకంగా హరీష్ రావు వైఎస్ కలిసి హోంమంత్రి పదవి దక్కించుకున్నారనే వార్త సైతం వినపడింది. టీఆర్ఎస్ ను ముప్పుతిప్పలు పెట్టి ఒకనొక దశలో పార్టీ అద్యక్షుడిగా కేసీఆర్ వైదొలుగుతాను అనేలా చేశారు వైఎస్..
ఇక చంద్రబాబు పార్టీని నామరూపాల్లేకుండా అందరినీ లాగేశాడు.. అసెంబ్లీలో చంద్రబాబును ఏడిపించారు. నవ్వుకున్నారు..
నిజంగా వైఎస్ బతికి ఉంటే తెలంగాణ వచ్చేది కాదని కేసీఆర్ ఓ సమయంలో అన్నారంటే ఆయన స్టామినా అర్థం చేసుకోవచ్చు..