Breaking News

ఆయన ప్రతిరోజూ ప్రజాక్షేత్రంలోనే…

IMG-20180509-WA0277

ఆయన ప్రతిరోజూ ప్రజాక్షేత్రంలోనే…. నిత్యం ప్రజా సమస్యలు తెలుసుకొంటూ వాటి పరిష్కారానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తున్నారు ధర్మపురి శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ .నిరంతరం ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారికి ఏ కష్టమొచ్చినా, ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూర్ గ్రామానికి చెందిన రైతు కనపర్తి కమలాకర్రావు కుటుంబానికి ప్రభుత్వం నుండి మంజూరైన 5 లక్షల రూపాయల చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు కొప్పుల ఈశ్వర్ బుధవారంనాడు అందజేశారు. తన కుటుంబాన్ని ఆదుకున్న కేసీఆర్కు ,కొప్పుల ఈశ్వర్ కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు .అలాగే ఈరోజు ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ మరో కార్యక్రమంలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. తదనంతరం తన సతీమణి స్నేహలత తో కలసి కమలాపూర్ గ్రామంలో ఎల్లమ్మ పట్నాలకు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.                       IMG-20180509-WA0279

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *