Breaking News

ఆయన అవునంటే ‘మంత్రి’.. కాదంటే ‘కంత్రి’

kcr super power -02

హైదరాబాద్, ప్రతినిధి :
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు.. సీఎం కేసీఆర్ తలుచుకుంటే ఎంత సేపు.. తెలంగాణ రాష్ట్రానికి అన్నీ తానై వ్యవహరిస్తున్న కేసీఆర్.. ఆదివారం ఎవరూ ఊహించని.. మీడియా కనిపెట్టని.. మంత్రులు ఆలోచించని విధంగా ఊపిరి తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా రెండంటే రెండు గంటల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులను చేశారు. రాజయ్యను తొలగించి కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎంగా చేసేశారు. ఇదంతా ఎవరికీ బయటకు పొక్కక పోవడం కేసీఆర్ రాజకీయ చాతుర్యానికి తార్కాణంలా నిలించింది.

రాజకీయాల్లో పండిపోయిన కేసీఆర్ అవినీతి విషయంలో స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసెంబ్లీ మైహోం, భూ కబ్జాలంటూ ప్రతిపక్షాలు గొంతుచించుకున్న స్పందించని సీఎం… రాజయ్య విషయంలోనే ఇంతలోనే ఇలా స్పందించడం నిజంగా ఆశ్చర్యపరిచింది. రాజయ్యపై అవినీతి ఆరోపణలు వచ్చిన మాట వాస్తవమే అయినా ఎవరూ రాజయ్యను మంత్రివర్గం నుంచి ఇంత త్వరగా తీసేస్తారని ఊహించలేదు.. రాజయ్యను డిప్యూటీ సీఎంగా చేసినప్పటినుంచే ఆయన వైఖరి సీఎం కేసీఆర్ చికాకు తెప్పిస్తోంది. రాజయ్య కూడా తన శాఖలో.. నిర్ణయాల్లో కేసీఆర్ ను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆయనకు చేటు తెచ్చింది. ఇవన్నీ కలగలిపి ఆయన పోస్టును ఊస్టు చేసింది.

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఒక సూపర్ పవర్. ఆయన అవునంటే మంత్రి, కాదంటే కంత్రి.. సో.. మంత్రులూ బీ కేర్ ఫుల్..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *