Breaking News

ఆయన అలిగాడు..

prez1-624x416

ఢిల్లీ, ప్రతినిధి : ఢిల్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమినుంచి ప్రధాని కోలుకోవడం లేదట.. నిన్న జరిగిన గవర్నర్ల సదస్సులో ఆయన ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చాలా ముభావంగా సీరియస్ గా కనిపించారు. ఎవరు పలకరించిన స్పందించలేదట.. ఇదంతా సామన్యుడి దెబ్బకు కకావికలమైన బీజీపీ ఢిల్లీ ఎన్నికల ఓటమే కారణమని అక్కడున్న వారు మాట్లాడుకున్నారు..

ఆయన ఎంతలా అలిగారంటే.. ఆయన సన్నిహితుడు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కుమారుడి పెళ్లికి సైతం హాజరుకాలేదంటే ఆయనకు ఓటమి ఎంత బాధ కలిగించిందో అర్థం చేసుకోవచ్చు. రోజూ కనీసం నాలుగైదు కార్యక్రమాల్లో పాల్గొనే ఆయన బుధవారం దీనదయాల్ జయంతి సందర్భంగా ఎక్కడా కార్యక్రమాల్లో పాల్గొనకుండా కేవలం ట్విట్టర్ లో నివాళి ఘటించి ఇంటికే పరిమితమయ్యాడట..

ఇప్పటివరకు ఓటమి ఎరుగని చరిత్ర నరేంద్ర మోడీది… గుజరాత్ ఎన్నికల్లో నాలుగు సార్లు గెలుపొంది.. సీఎంగా అప్రతిహతంగా పాలించారు. దాంతో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంటిచేత్తో దేశంలో కాంగ్రెస్ ను కూలదోసి అధికారం సంపాదించారు. గడిచిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో సైతం పార్టీ ని గెలిపించి బలమైన నేతగా ఆవిర్భవించారు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం తన మ్యాజిక్ కష్టం ఫలించక తొలిసారి ఓటమి ఎదురవడంతో ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక సామాన్యడు.. అది ఓ చిన్న పార్టీ చేతిలో ఓడిపోవడం.. మీడియా దాన్ని ఎలుగెత్తి చాటడం.. మోడీ ముభావానికి కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *