ఆయన అడుగులు టీఆర్ఎస్ వైపు..

ఇన్నాళ్లు ఏకపక్షంగా ఉన్న తెలుగు సినీ ఇండస్ట్రీని నటుడు రాజేంద్రప్రసాద్ గాడినపెట్టాడు. బడా నిర్మాతలు, కొందరు అగ్ర హీరోల కుటుంబ సభ్యుల ఆదిపత్యాన్నికి చెక్ చెప్పి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. దీంట్లో తెలంగాణ ప్రభుత్వం ఇతోదక సాయం చేసింది.

పేదకళాకారులకు పింఛన్ ఇచ్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో రాజేంద్రప్రసాద్ టీఆర్ఎస్ కు దగ్గరయ్యారు. మంత్రి కేటీఆర్ సైతం రాజేంద్రప్రసాద్ తో సాన్నిహిత్యం పెంచుకొని టాలీవుడ్ లో తెలంగాణ ప్రభుత్వ ముద్ర ఉండేలా చూసుకున్నారు. వీరి మధ్య ఏర్పడిన ఈ బంధం పొలిటికల్  ఎంట్రీవైపు దారితీస్తోంది.. రాజేంద్రప్రసాద్ 2019 ఎన్నికలకు పొలిటికల్ ఎంట్రీ రెడీ చేసుకుందామని ప్రయత్నాలు ప్రారంభించార..? మంత్రి కేటీఆర్ ను కలిసి టీఆర్ఎస్ తరఫున పోటీచేయడానికి ఆసక్తి చూపాడట.. అయితే ఎంపీగా.. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు వీరి మధ్య చర్చలు జరిగియాని ఇన్ సైడ్ టాక్.. 2019 వరకు ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ను రాజేంద్రప్రసాద్  కోరారట.. 2019 ఎన్నికల్లో హైదరాబాద్ లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపినట్టు సమాచారం. టాలీవుడ్ ను టీఆర్ఎస్  మచ్చిక చేసుకునేందుకు.. ఆంధ్రావారి ఓట్లు రాబట్టేందుకు రాజేంద్రప్రసాద్ టీఆర్ఎస్ చేరిక ఉపయోగపడుతుందని కేటీఆర్ కూడా సరేనన్నారని సమాచారం.. అందుకే త్వరలో రాజేంద్రప్రసాద్ టీఆర్ఎస్ లో చేరిక దాదాపుగా ఖయమే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *