ఆయనది వెన్నుపోటు దారి.. నాది రాజ దారి..

27-1453903201-ys-jagan-625

చంద్రబాబుకు తనకు మధ్య ఒకటే తేడా అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ అన్నారు. రాష్ట్రపతిని కలిసిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పోడిచి గద్దెనెక్కారని.. ఇప్పుడు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను సైతం దొడ్డిదారిలో పార్టీలో చేర్చుకున్నారని.. బాబు బతుకే వెన్నుపోటు రాజకీయాలని ధ్వజమెత్తారు. తాను సమైక్య రాష్ట్రంలో మా పార్టీలో చేరిన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి గెలిపించుకున్న చరిత్ర మాదేనన్నారు. వైఎస్సార్ సీపీ, తనది ఎప్పటికీ రాజమార్గం తప్ప చంద్రబాబులా వెన్ను పోటు దారి కాదని జగన్ విమర్శించారు.

చంద్రబాబు తన సొంత మీడియాలో అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారని.. ప్రజలు ఇప్పటికే చంద్రబాబు మీద కోపంతో ఊగిపోతున్నారన్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ ఎమ్మెల్యేలంతా వైసీపీలో చేరతారని.. టీడీపీది మునిగిపోయే పడవ అని ధ్వజమెత్తారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *