Breaking News

ఆయనకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న కేసీఆర్

64367987-kcr-on-telangana

తెలంగాఱ డిప్యూటీ సీఎం మహమూద్ అలీపైనే దాడులకు దిగారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకం.. ఇంతలా రెచ్చిపోతున్న ఎంఐఎంకు ఉన్న బలం, బలగం ఏమిటీ.. జనబలంతో ఇష్టానుసారంగా చెలరేగిపోతున్న వారి ఆగడాలకు చెక్ చెప్పడానికి అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి.. టీఆర్ఎస్ ముఖ్యంగా పాతబస్తీలో పట్టుకోసం పాకులాడుతోంది. గ్రేటర్ ఓట్ల పండుగ ముగియడంతో రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తోంది. గ్రేటర్ పీఠం కనుక గులాబీ పార్టీ గెలిస్తే ‘గాలిపటం’ చిరగడం గ్యారెంటీ.. ఎందుకంటే ఇన్నాళ్లు అక్కడ వారి ఓటు బ్యాంకు ఉందనే అన్ని పార్టీలు నోళ్లు మూసుకొని వారితో పొత్తుకు తహతహలాడాయి.. అన్ని పార్టీలను చీప్ గా చూసి అవకాశవాద రాజకీయాలు చేసిన ఆ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, ఆఖరకు అధికార పార్టీ  డిప్యూటీ సీఎంపై దాడులకు దిగి సవాల్ విసిరారు.. వాళ్లకు చెక్ చెప్పందేకు టీఆర్ఎస్ నాయకులు రంగం సిద్ధం చేస్తున్నారట..

డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కొడుకు ఇందులో కీరోల్ పోషిస్తున్నారు. ఇటీవల అతడిపై పాతబస్తీలో దాడి జరిగింది. వాళ్ల ఆగడాలను అడ్డుకున్నందుకే ఈ దాడి చేశారు. దీంతో గ్రేటర్ లో గెలిస్తే మహమూద్ అలీ కొడుకును పాతబస్తీ నాయకుడిని చేసేందుకు టీఆర్ఎస్ యోచిస్తోందట.. అంతేకాదు ఈ దాడులకు దిగిన వాళ్లకు గట్టి ట్రీట్ మెంట్ ఇవ్వడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమైంది. గ్రేటర్ పీఠం గెలిస్తే ఇక ఆ పార్టీ పని అయిపోయినట్టే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *