
-ఢిల్లీ ఎన్నికల్లో దూసుకెళ్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ
ఢిల్లీ, ప్రతినిధి : సర్వేలన్నీ నిజమవుతున్నాయి.. ఢిల్లీలో ఓట్ల లెక్కింపు మొదలైంది. ఉదయం 9 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం ఆమ్ ఆద్మీ అత్యధికంగా 40 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 14 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉండి దారుణ ఓటమి దిశగా కొనసాగుతున్నాయి..
దేశ రాజధాని ఢిల్లీ కావడంతో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ లు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశాయి. కానీ సామాన్యుడిగా ప్రజల మనసులను గెలుచుకున్న కేజ్రీవాలే ఈసారి ఢిల్లీ పీఠాన్ని అధిష్టించనున్నారు. బీజేపీ ఎన్నో ఎత్తులు వేసి కిరణ్ బేడిని రంగంలోకి దించిన ఫలితాల సరళి చూస్తే ఆ పార్టీకే తక్కువ సీట్లే వచ్చేలా ఉన్నాయి.
Your site provides very good and useful information. I hope it continues for a long time. Thank you