Breaking News

ఆమ్ ఆద్మీపై బీజేపీ ప్రతీకారం

Arvind-Kejriwal-L-PTI

-2 కోట్ల విరాళాలపై ఆప్ కు నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ
తమను ఢిల్లీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు గుర్రుగా ఉన్నారు. పనిలో పనిగా అన్నట్టు ఆప్ ప్రతిష్టను దిగజార్చే ఎత్తుగడకు పూనుకున్నారు. ఫలితాలు విడుదలై ఆప్ ఘన విజయం సాధించిన మరుసటి రోజే ఆ పార్టీకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఆప్ సేకరించిన 2 కోట్ల విరాళాల వివరాలు తెలుపాలని.. దీనికి ఈ నెల 16లోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర ఐటీ శాఖ అల్టీమేటం జారీ చేసింది.

ఢిల్లీ ఎన్నికలకు ముందు ఆప్ సేకరించిన విరాళాలపై బీజేపీ మండిపడింది.కొన్ని బోగస్ కంపెనీల నుంచి ఆప్ అక్రమంగా విరాళాలు సేకరించిందని విమర్శించింది. ఆప్ సేకరించిన డబ్బు నల్లధనమంటూ ఎన్నికల్లో ప్రచారం చేసింది. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ ఆప్ గెలిచిన మరుసటిరోజే నోటీసులు జారీ చేయడంపై రాజకీయ దురుద్దేశంతోనే బీజేపీ ఇలా చేసిందని ఆప్, కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. బీజేపీ మాత్రం ఐటీశాఖ తన పని తాను చేసుకుపోతోందని చెప్పుకొచ్చింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *