
హయాత్ బౌమెదీన్… ఫ్రాన్స్ ప్రజలు ఇప్పుడు ఈ పేరు వింటే వణికిపోతున్నారు. మూడు రోజులు దేశాన్ని గడగడలాడించిన ముగ్గురు ఉగ్రవాదులు హతమైనా, ముప్పు తొలగిపోలేదు. ఈ యువతి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంది. గ్రోసరీ షాపుపై దాడి చేసిన ఉగ్రవాది భార్య అయిన హయత్, ఫ్రాన్స్ లో తొలి మహిళా ఉగ్రవాది అయింది.
గురువారం నాడు మెట్రలో స్టేషన్ సమీపంలో తన భర్తతో కలిసి ఈ యువతి ఇద్దరు పోలీసులపై కాల్పులు జరిపింది. శుక్రవారం ఆమె భర్త గ్రాసరీ షాపులో కస్టమర్లను బందీలుగా పట్టుకోవడం, చివరకు నలుగురు బందీలను కాల్చి చంపి పోలీసుల కాల్పుల్లో హతం కావడం తెలిసిందే. అయితే ఆ షాపులో హయత్ లేదు. మరి ఆమె ఎక్కడుందో తెలియడం లేదు. దీన్ని బట్టి, ఫ్రాన్స్ కు ఉగ్రవాద ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు.
హయత్ ఒక్కతే పరారీలో ఉందా లేక మరి కొందరు ఉగ్రవాదులు కూడా దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారా అనేది తెలియడం లేదు.