
హైదరాబాద్ : పాకిస్థాన్ ప్రముఖ ఆటగాడు ఆఫ్‌స్పిన్నర్ సయీద్ అజ్మల్‌పై ఐసీసీ వేటు వేసింది. అనుమానాస్పద బౌలింగ్ శైలి కారణంగా అజ్మల్‌పై ఐసీసీ నిషేధం విధించింది. అజ్మల్ మీద నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసీసీ ప్రకటించింది. గాలే టెస్టులో అజ్మల్ బౌలింగ్ శైలిపై అంపైర్లు ఫిర్యాదు చేశారు. కూలంకష విచారణ అనంతరం అజ్మల్‌పై నిషేధం విధించాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. బౌలింగ్ శైలి మార్చుకునేంత వరకు అజ్మల్‌పై నిషేధం కొనసాగనుంది. ప్రస్తుతం వన్డేల్లో నెంబర్‌వన్ బౌలర్‌గా అజ్మల్ రాణిస్తున్నారు. 209 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 446 వికెట్లు తీశాడు అజ్మల్. 2015లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో అజ్మల్ పాల్గొనడం అనుమానమే.