‘ఆప్’ విశ్వాస్ కు అక్రమ సంబంధం.?

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీకి మరో తలనొప్పి వచ్చి పడింది. ఆ పార్టీ మంత్రి, ఎమ్మెల్యే సీనియర్ నేత కుమార్ విశ్వాస్ పై ఓ మహిళ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. తనకు, విశ్వాస్ కు అక్రమ సంబంధం ఉందని.. అది మీడియాలో రావడంతో ఆయన తనను దూరం పెట్టాడని ఫిర్యాదులో పేర్కొంది.

కాగా ఈ వ్యవహారంలో కమిషన్ కుమార్ విశ్వాస్ ను విచారణకు రేపు రావాల్సిందిగా ఆదేశించింది. కాగా కొద్ది రోజులుగా మీడియాలో కుమార్ విశ్వాస్ ఓ మహిళకు సంబంధాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇలా ఓ మహిళ బయటపడడం ఆప్ పార్టీలో దుమారం రేపింది.

కాగా ఆ మహిళకు, తనకు ఏ సంబంధం లేదని.. కావాలనే బీజేపీ నాయకులు, కొందరు మీడియా ప్రతినిధులు ఆప్ ను అప్రతిష్ట పాలు చేయాలనే ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *