ఆప్ లో అంతే…

కొత్త తరహా రాజకీయాల ఆమ్ ఆద్మీ పార్టీ లో పాత తరహా కథే నడిచింది. మార్పు కోసం ప్రశ్నించిన ఇద్దరినీ శిక్షించారు. యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లను పొలిటికల్ అఫైర్స్ కమిటీ నుంచి తప్పించారు. చివరకు అధికార ప్రతినిధి బాధ్యత నుంచి కూడా యాదవ్ ను తప్పించారు.

వీరిద్దరూ కొత్త పదవులు కోరలేదు. ఉన్నవే వదులుకుంటామన్నారు. పీఏసీలో మహిళలకు, దక్షిణాదికి ప్రాతినిధ్యం లేదని, సామాజిక సమతుల్యత లేదనేది వీరి ఉద్దేశం. పాత సభ్యులందరం బయటకు వెళ్దాం, కొత్త వారికి అవకాశం ఇద్దామని ఏడాదిగా వీరు

కోరుతున్నారట. అలాగే, ఏకవ్యక్తి ఆధారిత పార్టీలా కాకుండా, అంతర్గత ప్రజాస్వామయం ఉండాలనేది వీరి డిమాండ్. కానీ కేజ్రీవాల్ విధేయులు ఇందుకు ఒప్పుకోవడం లేదు.

వీరిద్దరి డిమాండులో అన్యాయం ఏమీలేదు. మహిళలకు ప్రాధాన్యం విషయంలో ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయి. పార్టీ వ్యవస్థాపక సభ్యులు కొందరు గతంలో కేజ్రీవాల్ వైఖరి నచ్చక గుడ్ బై చెప్పారు. వారు చేసిన ఆరోపణల్లో ప్రధానమైంది, అది మహిళా వ్యతిరేక పార్టీ అని. అది నిజమే అన్నట్టు.. కేజ్రీవాల్ తాజా మంత్రివర్గంలో ఒక్క మహిళకూ చోటు దక్కలేదు.

ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరికీ మంత్రి అయ్యే అర్హత లేదా? ఢిల్లీలో మహిళా భద్రతే పెద్ద అంశం. ఆప్ కు ఓటు వేసిన వారిలో సగం మంది మహిళలే. అయినా కేజ్రీవాల్ మహిళలకు అవకాశం ఇవ్వకపోవడం ఆయన మహిళా వ్యతిరేక పోకడకు నిదర్శనమని ఇదివరకే విమర్శలున్నాయి. ఇప్పుడు యాదవ్, భూషణ్ లను కసిదీరా శిక్షించిన కేజ్రీవాల్ విధేయులు వాలంటీర్లకు, ప్రజలకు ఏ సందేశం ఇచ్చారు?

ఆప్ అందరిలాంటిదే అనా, మిగతా వారికంటే కూడా ఘోరమైన పార్టీ అనా? మహిళల గురించి అడగవద్దనా? ఆప్ నేతలే జవాబు చెప్పాలి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *