Breaking News

ఆపద్బాంధవుడు…

ఆపద్బాంధవుడు...

కన్నతండ్రి, సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష దీన గాథ … మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఆమె పరిస్థితి తెలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చలించి పోయారు. ఆమె బాగోగులు చూడండని అధికారులకు ఆదేశాలిచ్చి ఊరుకోవడం అనే ఆనవాయితీకి భిన్నంగా, తానే ఆస్సత్రికి తరలివచ్చారు. హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను సతీ సమేతంగా పరామర్శించారు. అండగా నేనున్నానని భరోసా ఇచ్చారు.

ఓ బాధితురాలిని ముఖ్యమంత్రి ఇలా సకుటుంబంగా వచ్చి పరామర్శించడం అరుదైన విషయం. స్వయంగా ముఖ్యమంత్రే కదిలిరావడం, ప్రత్యూషకు కొండంత ధైర్యాన్నిచ్చింది. తాను ఒంటరి దాన్ని కాదనే మనో స్థయిర్యాన్నిచ్చింది. ముఖ్యమంత్రే కదలివచ్చారంటే రాష్ట్రం రాష్ట్రమే అనకు అండగా ఉందనే భరోసా వచ్చింది.

ప్రత్యూష ఆలనా పాలనా చూడటానికి కేసీఆర్ ఉదారంగా ముందుకు వచ్చారు. ముందు, ఆమెను తన ఇంటికి తీసుకెళ్తానని చెప్పారు. ఓ వారం రోజులు తన కూతురిలా ఆమె తన ఇంట్లోనే ఉండొచ్చని చెప్పారు. ఆ తర్వాత ఆమె కోరుకున్న విధంగా మంచి హాస్టల్లో చేర్పించి చదివిస్తానని హామీ ఇచ్చారు. చదువంటే ఎంతో ఆసక్తి ఉన్న ప్రత్యూషకు, స్వయంగా ముఖ్యమంత్రే చదివిస్తాననడం ఎంతో ఉత్సాహాన్ని, విశ్వాసాన్ని ఇచ్చింది.

ఒక రొటీన్ అధికారిక విధిగా భావించి, అధికారులను ఆదేశించడం మామూలే. అలా కాకుండా ఇది ఒక మానవీయ కర్తవ్యంగా భావించి, నిండు మనసుతో ఆ అభాగ్యురాలికి అండగా ఉంటానంటూ ముఖ్యమంత్రి స్వయంగా ఆస్పత్రికి వెళ్లి భరోసా ఇవ్వడం చాలా అరుదు. కేసీఆర్ ఔదార్యం చూసిన చాలా మంది అభినందించారు. ఉద్యమకారుడిగా, రాజకీయ నాయకుడిగా, పరిపాలకుడిగానే కాదు, స్పందించే మనసున్న మనిషిగా కూడా కేసీఆర్ తన ప్రత్యేకతను చాటుకున్నారంటూ చాలా మంది ప్రశంసల వర్షం కురిపించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *