ఆన్ లైన్ స్వేచ్ఛకు సుప్రీం ఆమోదం

Supreme-Court-Right-To-Reject copy

ఆన్ లైన్ లో ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారు జైలు పాలైన సంగతి తెలిసిందే.. అయితే ఈ ఆన్ లైన్ స్వేచ్ఛకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐటీచట్టంలోని వివాదాస్పద 66ఏ సెక్షన్ ను న్యాయస్థానం కొట్టి వేసింది. ఆ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. న్యాయ విద్యార్థి శ్రేయ సింఘాల్ పిటీషన్ ఆధారంగా న్యాయస్తానం ఈ తీర్పు చెప్పింది.

ఈ తీర్పు ప్రకారం ఆన్ లైన్ అవమానకర కామెంట్లు పెట్టిన జైలు శిక్ష ఉండదని పిటీషనర్ తెలిపారు. సెక్షన్ దుర్వినియోగం అవుతుందన్న ప్రభుత్వ వాదనను కొట్టివేసింది. దీంతో ఇక నుంచి ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాద్యమాల్లో స్వేచ్ఛ గా తమ అభిప్రాయాలు చెప్పవచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *