ఆన్ లైన్ మీడియా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్

ఆన్ లైన్ మీడియా లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అన్నారు.  ఆన్ లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అయిలు రమేష్, ప్రధాన కార్యదర్శి ధర్మాసనం శ్రీధర్, ఉపాధ్యక్షులు సూర్యారావు, కార్యవర్గ సభ్యులు రామమూర్తి లు రాజ్యసభ సభ్యులుగా సంతోష్ కుమార్ ఎన్నికైన సందర్భంగా  గురువారం నాడు ప్రగతిభవన్ లో ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆన్ లైన్ మీడియా జర్నలిస్టుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ సమాచార శాఖ కమిషనర్ తో మాట్లాడి ఆన్ లైన్ మీడియా జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చూస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, ఈ సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో ఆన్ లైన్ మీడియా కీలక పాత్ర వహించాలని ఆయన సూచించారు .తెలంగాణలో ఆన్ లైన్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ లు ఇవ్వాలని, అక్రిడిటేషన్ కమిటీలో తమ అసోసియేషన్ ప్రతినిధులను సభ్యులుగా నియమించాలని, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కు ఇచ్చిన విధంగానే ఆన్లైన్ మీడియాకు కూడా ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలని అసోసియేషన్ అధ్యక్షులు అయిలురమేష్, ప్రధాన కార్యదర్శి ధర్మాసనం శ్రీధర్ లు కోరుతూ సంతోష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.  తమ సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని సంతోష్ కుమార్ సానుకూలంగా స్పందించారు.

SANTHOSH 4  SANTHOSH 6  SANTHOSH2 SANTHOSH 5 SANTHOSH 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.