
హైదరాబాద్, ప్రతినిధి : ఆన్ లైన్ శరవేగంగా విస్తరిస్తున్న సమయంలో ప్రభుత్వం గుర్తించి ఆదరించాలని.. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వలే అక్రిడేషన్, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే ప్రధానకార్యదర్శి విరాహత్ అలీ అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో పొలిటికల్ ఫ్యాక్టరీ వెబ్ చానల్ ప్రారంభోత్సవం పొలిటికల్ ఫ్యాక్టరీ సీఈవో, చీఫ్ ఎడిటర్ అయిలు రమేశ్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. పొలిటికల్ ఫ్యాక్టరీ రమేశ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. ప్రయత్నం ఏదైనా మొదలు పెడితే చివరి వరకు లాక్కెళ్లే శక్తి రమేశ్ కు ఉంది. సోషల్ మీడియా విస్తరించిన వేళ అవకాశాలను అందిపుచ్చుకునేలా రమేశ్ చేసిన వెబ్ చానల్ అందరనీ అలరిస్తుందన్నారు. కానీ ప్రభుత్వాలు వీటిని ఆదరించడం లేదన్నారు. కొన్ని వెబ్ చానల్స్ దూసుకొస్తున్నాయని ఇలాంటి వాటిని ఆదరించాలని.. మున్ముందు ఇలానే అద్భుత చానల్ తీసుకొచ్చినందుకు అభినందిస్తున్నానని పేర్కొన్నారు. శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించిన సంస్థనుఆయన స్పూర్తితో మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
పద్మను ప్రెస్ క్లబ్ లో చూసి తెలంగాణ హీరోయిన్ వచ్చినందకు సంతోషంచానన్నారు విరాహత్.. బంజారా మారుమూల అమ్మాయిని సినిమాల్లోకి తెచ్చిన ఆర్ నారాయణమూర్తిని అభినందించాన్నారు. మన న్యూస్ లలో కూడా పద్మ కు ప్రాధాన్యతనిచ్చి గుర్తించాలని.. మాస్ హీరోయిన్ గా పద్మ ఎదగాలని ఆవించారు.