ఆన్ లైన్ కొనుగోళ్ల కోసం SBI క్రెడిట్ కార్డులు

ఆన్ లైన్ కొనుగోలు దారులు ఈ మధ్య పెరిగిపోతున్నారు.. దీంతో వారి అవసరాలను క్యాష్ చేసుకోవాలనే తలంపుతో ఎస్ బీ ఐ సంస్థ సింప్లీక్లిక్ పేరుతో ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొస్తోంది.. అమెజాన్ ఇండియా, బుక్ మై షో, క్లియర్ ట్రిప్, ఓలా క్యాబ్స్, లెన్స్ కార్ట్, ఫుడ్ పాండా, ప్యాబ్ ఫర్నిష్ సంస్థలు ఈ కార్డులో భాగస్వాములయ్యాయి.

సాధారణ కార్డులకంటే ఈ సింప్లీ కార్డుతో ఆన్ లైన్లో జరిపే కొనుగోళ్లకు 5 రెట్లు రివార్డు పాయింట్లు అందజేస్తామని ఎస్ బీ ఐ కార్డ్ సీఈవో తెలిపారు.

ఈ కార్డుతో ఏడాదికి 2 లక్షల మేర ఖర్చు పెట్టే వారికి రూ.4 వేల వోచర్లు, ఈ కార్డు ధర 499 అని తెలిపారు. ఈ కార్డు కొన్నవారికి అమెజాన్ నుంచి రూ.500 గిఫ్ట్ వోచర్ వస్తుందని పేర్కొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.