
ఆన్ లైన్ మీడియాకు నూతన పాలసీ ని రూపొం దించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాల్సిందిగా కోరుతూ తెలంగాణ ఆన్ లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధి బృందం రాష్ట్ర డైరెక్టర్ జర్నల్ పోలీసు (డీజీపీ) అనురాగశర్మను శుక్రవారం నాడు కలిసి వినతిపత్రం సమర్పించింది. ఆ సంఘము అధ్యక్షుడు అయిలు రమేష్, ప్రధాన కార్యదర్శి ధర్మాసనం శ్రీధర్, సంయుక్త కార్యదర్శి కళ్యాణం శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు హన్మంతరావు డీజీపీ ని కలిసిన వారిలో ఉన్నారు. డీజీపీ సానుకూలంగా స్పందిస్తూ ఆన్లైన్ జర్నలిస్టు ల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వానికి సిఫారసు చేస్తానని ఆయన హామీ ఇచ్్చారు.