ఆనందగజపతి రాజు మృతికి పలువురి సంతాపం

కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సోదరుడు ఆనంద గజపతిరాజు శనివారం అనారోగ్యంతో మృతిచెందారు. ఆనంద గజపతిరాజు గతంలో విశాఖ ఎంపీగా పనిచేశారు. మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గా.. ఎంపీగా , మంత్రిగా ప్రజలకు ఎన్నో సేవలను అందించారు. ఆనంద గజపతిరాజు కుటుంబ సభ్యులకు స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు దేశం సీనియర్ నాయకుడిగా నిరుపేదలకు సేవలు అందించిన ఆనంద గజపతిరాజు ఎన్నో పదవులతో నిస్వార్థంగా ప్రజాసేవకు అంకితం అయ్యారని కోడెల తెలిపారు..

కాగా ఆనంద గజపతిరాజు మృతిపట్ల సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. ఆయన మృతి రాష్ట్రానికి తీరని లోటన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *