
బోగస్ ఓటర్లను ఏరివేసేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఇక గ్రామాల్లో, సిటీల్లో రెండు చోట్ల ఉన్న ఓటర్లందరూ ఒకే ప్రాంతానికి పరిమితం అవ్వక తప్పదు.. ఓటర్ల ఆధార్ నంబర్ ను సేకరించి దాన్ని ఓటరు గుర్తుంపు కార్డు నంబర్ తో అనుసంధానం చేస్తారు. దీని వల్ల రెండు చోట్ల ఉన్న ఓట్లు గల్లంతవుతాయి. కేవలం ఒక ఓటరుకు ఒక ఓటు మాత్రమే ఉంటుంది.
ఏప్రిల్ 1 నుంచి అధికారులు ఇంటింటికి వెళ్లి ఆధార్ కార్డులను వివరాలు సేకరించనున్నారు. ఆధార్ కార్డు, ఓటరు కార్డు జిరాక్స్ తో పాటు చిన్న పత్రాన్ని ఓటర్ల చేత పూర్తి చేస్తారు. ఇందులో ఓటర్ మొయిల్ ఐడీ, మోబైల్ నెంబర్ ను నమోదు చేయాల్సి ఉంటుంది.
ఆన్ లైన్ ద్వారా కూడా ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు.. www.ceoandhra.nic.in, www.ceotelangana.nic.in లలో కూడా నమోదు చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్ లోడ్ చేసుకొని పూర్తి చేయవచ్చు.