ఆధార్ తప్పనిసరి.. బిల్లు వస్తోంది..

దేశంలోని ప్రతి వ్యక్తికి ఆధార్ తప్పనిసరి. ఈ ఆధార్ లేకుంటే ఇక ప్రభుత్వ పథకాలు అందవు.. దరి చేరవు.. ఆధార్ ను ప్రభుత్వ పథకాలకు అనుసంధానించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించాయి..కేంద్రప్రభుత్వం ఈ మేరకు ఆధార్ ను చట్టబద్ధం చేస్తూ బీజేపీ ప్రభుత్వం చట్టం తెస్తోంది.

సుప్రీం కోర్టులో ఆధార్ పై ప్రజాప్రయోజనాలు ఎన్నో దాఖలయ్యాయి. ఆధార్ ను ప్రభుత్వ పథకాలకు అనుసంధానం చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని సుప్రీం ను కోరారు. ఈ విషయంలో ఆధార్ తప్పనిసరి కాదని సుప్రీం కేంద్ర ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేసింది.

కాగా ఆధార్ తో అనుసంధానం వల్ల కేంద్రానికి 15వేల కోట్లు , నాలుగు రాష్ట్రాలకు 2300కోట్లు ఆదా అవుతున్నాయని.. సుప్రీంలో ఆధార్ పై తీర్పు రావడంతో ఈ చట్టం తెస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదం పొందితే ఇక ప్రతీ పథకానికి ఆధార్ తప్పనిసరి కానుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *