Breaking News

ఆదిలాబాద్ గుట్టల్లో అరుదైన రాబందులు

Vultures_1477257f

దేశంలో అంతరించిపోయాయనుకున్న రాబందుల జాడ దొరికింది. ఆదిలా బాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని ఓ గుట్టలో రాబందులు నివాసం ఉంటున్నాయి. వీటిని కేంద్రం అటవీ అధికారులు కనుగొన్నారు.

దేశంలో మరెక్కడా వీటి జాడ లేదు. ఒకప్పుడు విరివిగా ఉన్న రాబందుల జాతి దాదాపుగా అంతరించిపోయింది. కానీ ఆదిలాబాద్ జిల్లా లోని దట్టమైన అడవి గుట్టలో వీటి జాడ కనిపించింది. దీంతో కేంద్రం, ఆటవీ అధికారులు వీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. గుట్టల వద్ద ఓ బేస్ క్యాంపును ఏర్పాటు చేశారు.

రాబందుల రక్షణ కోసం రూ.5 లక్షలను కూడా ప్రభుత్వం అటవీశాఖ మంజూరు చేసింది. దీంతో అటవీ అధికారులు రాబందులకు నివాసం, ప్రత్యుత్పత్తి చర్యలను చేపట్టారు. అంతేకాకుండా రాబందులకు ఆహారంగా వేయడానికి కొన్ని మేకలను పెంచుతున్నారు. ప్రస్తుతం గుట్టపై 19 రాబందులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *