ఆదిలాబాద్, కరీంనగర్ లలో ఇద్దరు చంద్రుల పర్యటన

naidu_kcr630

కరీంనగర్, ప్రతినిధి : ఒకేరోజు ఇద్దరు చంద్రులు తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జైపూర్ మండలంలో సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన 1200 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులో మరో 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు ఏర్పాటుకు కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

ఇక ఏపీ సీఎం చంద్రబాబు నేడు కరీంనగర్ లో పర్యటించనున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా మొన్న వరంగల్ లో పర్యటించిన చంద్రబాబు.. ఆ పర్యటన విజయవంతం కావడంతో ఇక కరీంనగర్ కు రానున్నారు. ఇక్కడ జరగబోయే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. టీఆర్ఎస్ ధాటికి దాదాపుగా తెలంగాణలో తుడుచుపెట్టుకుపోతున్న టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి రాబోయే ఎన్నికలకు సిద్ధం కావడానికి టీడీపీ అధినేత పర్యటన మార్గం చూపుతుందుని తెలుగుదేశం నాయకులు పేర్కొంటున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *