Breaking News

ఆదాయం కోసం న్యూఇయర్ వేడుకలపై పన్ను

6427-000127

తెలంగాణ ప్రభుత్వం ఆదాయమార్గాలపై కన్నేసింది. అందుకే దేన్ని వదలడం లేదు.. అందుకోసం నూతన సంవత్సర వేడుకలపై పన్ను వేయాలని నిర్ణయించింది.. తెలంగాణలో 2016 కు స్వాగతం పలుకుతూ నిర్వహించే కొత్త సంవత్సర వేడుకలపై 20శాతం మేర వినోద పన్ను వేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 31 లోపు అందరూ కొత్త సంవత్సర నిర్వాహకులంతా వాణిజ్య పన్నుల శాఖ వద్ద నమోదు చేసుకొని పన్ను కట్టాల్సి ఉంటుంది. పన్ను కట్టని నిర్వాహకులపై పన్ను మొత్తంతో సహా మరో మూడు రెట్ల కు తగ్గకుండా జరిమానా వసూలు చేస్తామని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు.

జరిమానా 5 రెట్లు వరకు కూడా ఉండొచ్చని అధికారులు హెచ్చరించారు. గత సంవత్సరం 2015 ఎన్నికల సమయంలోనూ వాణిజ్యపన్ను లశాఖ వినోద పన్నును రాబట్టింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *