ఆదరించండి అండగా ఉంటా

ఆదరించండి అండగా ఉంటా

-తాజా మాజీ ఎమ్మెల్యే, పాలకుర్తి టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఎన్నికల్లో మరోసారి ఆదరించాలని, పాలకుర్తి ప్రజలకు అండగా ఉంటానని టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునుతుల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళ హారతులు, కోలాటం, ఆటపాటలు, డప్పుచప్పుళ్లు, ఒగ్గుడోళ్లతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ కు అండన్నారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీఆర్ఎస్ గెలుపొందడం ఖాయమని, ఇందుకు ప్రజల నుంచి వస్తున్న మద్దతే నిదర్శనమని అన్నారు. ఓట్ల కోసం వచ్చే మహాకూటమి అభ్యర్థులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ తోనే తెలంగాణలోని అన్ని వర్గాలకు గుర్తింపు లభించిందన్నారు. కార్యక్రమంలో జీసీసీ చైర్ పర్సన్ గాంధీనాయక్, జడ్పీటీసీ లలిత ప్రేమకుమార్, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి,పేరం రాము, దళిత రత్న యాకయ్య, రామోజీ, మండల నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

errabelli dayakar rao 1     errabelli dayakar rao 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *