
పార్లమెంటు చరిత్రలోనే ఈ సమావేశాలు చీకటి రోజులు.. ఎందుకంటే కాంగ్రెస్ ఆందోళనలతో ఒక్కరోజు కూడా పార్లమెంటు సమావేశాలు జరగలేదు.. కనీసం ప్రతిపక్ష ఆందోళనలపై కనీసం సంప్రదించకుండా బీజేపీ గాలికి వదిలేసింది.. దీంతో కోట్ల రూపాయల ప్రజాధనం పార్లమెంటు సాక్షిగా వృథా అయ్యింది.. దీనికి మన రాజకీయ నాయకులు ఎంచుకున్న టాపిక్ అవినీతి.. లలిత్ మోడీ, వసుంధర రాజే, వ్యాపం కుంభకోణం మధ్యప్రదేశ్ సీఎం రాజీనామాలు..
కాగా ఈ మూడు అవినీతి విషయంలో బీజేపీ కనీసం చర్చకు అనుమతించలేదు.. ఆధారాలు అడగలేదు.. కాంగ్రెస్ ఆందోళనలు అడ్డుకోలేదు.. పార్లమెంటు రోజురోజుకు రద్దవుతున్నా కనీసం చర్యలు తీసుకోలేదు.. కనీసం కాంగ్రెస్ కూడా తమ ఆందోళనలపై వెనక్కి తగ్గలేదు.. దీంతో పార్లమెంటు పరువు మంటగలిసింది..
అవినీతి విషయంలో కాంగ్రెస్ పీహెచ్ డీ చేసింది.. బీజేపీ ఏం తక్కువ తినలేదు.. అందని అధికారం మోడీ శ్రమతో అందినా.. నీట్ ఇమేజ్ ను కాపాడుకోలేక. ఒక్కొక్క నేత అవినీతి బాట పడుతున్నాడు.. ఇన్నాళ్లు అధికారానికి దూరంగా ఉన్నామని కాబోలు బీజేపీ నేతల అవినీతి పరాకాష్టకు చేరింది..
ఏది ఏమైనా దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టి.. బీజేపీ కాంగ్రెస్ లు స్వప్రయోజనాల కోసం పార్లమెంటును వేదికగా చేసుకోవడం దేశ ప్రజల దౌర్భాగ్యం.. పాలకులు మారినా పాలన మారలేదనడానికి ఇదే తాత్కారం..