ఆడియో పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘గోపాల గోపాల’

గత ఏడాది విడుదలైన ‘రేసుగుర్రం’,‘లెజెండ్’‘దృశ్యం’చిత్రాలు మంచి సెన్సేషనల్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ మూడు చిత్రాల ఆడియో లహరి మ్యూజిక్ ద్వారా విడుదల అవడం ఓ విశేషం. 2015 ప్రారంభంలోని లహరి మ్యూజిక్ ద్వారా జనవరి 1న ‘గుండెజారి గల్లంతు అయ్యిందే’కన్నడ వెర్షన్ ‘ఖుషి ఖుషి యాగి’అక్కడ విడుదలయ్యింది. ఆ చిత్రంలోని పాటలు ప్రస్తుతం కర్ణాటక అంతా మారుమోగుతున్నాయి. అదే విధంగా విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల మల్టీ స్టారర్ ‘గోపాల గోపాల’జనవరి 4న ఆడియో విడుదలైంది. జనవరి 10న విడుదలైన ఈ చిత్రం హౌస్ పుల్ కలెక్షన్స్ తో సెన్సేషనల్ హిట్ అయ్యింది. చిత్రంతో పాటు ఆడియో కూడా మంచి హిట్ అయ్యింది. ఈ సందర్భంగా.. లహరి మ్యూజిక్ అధినేత జి.మనోహర్ నాయుడు మాట్లాడుతూ ‘‘2014లో మా సంస్ధ ద్వారా విడుదలైన ‘రేసుగుర్రం’.‘లెజెండ్’,‘దృశ్యం’చిత్రాలు ఆడియో పరంగా మాకు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. శుభసూచకంగా 2015 ప్రారంభం నుండే వరుసగా ‘గుండె జారి గల్లంతు’అయ్యిందే‘కన్నడ వెర్షన్ ఖుషి ఖుషి యాగి, తెలుగులో ‘గోపాల గోపాల’ఆడియో పరంగా పెద్ద హిట్ అయినందుకు చాలా సంతోషంగా వుంది. ఇది ఓ సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు. ‘గోపాల గోపాల’మేము ఊహించిన దానికంటే రికార్డు స్ధాయిలో డిజిటల్ డౌన్ లోడ్స్ అవుతున్నాయి. ఈ రోజు తెలంగాణా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రాలలో ఎక్కడ చూసిన ‘డోలు భాజే డోలు బాజే..’సాంగ్ వినబడుతుంది. మొబైల్ ఫోన్స్ లో రింగ్ టోన్ కూడా అదే. మిగతా పాటలు కూడా బాగున్నాయని అంటున్నారు. 2015ఆడియో సేల్స్ లో టాప్ పొజిషన్ లో వుండటం మారు ఆనందాన్ని కలిగిస్తుంది. మా సంస్ధ మీద నమ్మకంతో ఈ ఆడియో హక్కులు మాకు ఇచ్చి ప్రోత్సహించిన సురేష్ బాబు, శరత్ మరార్ లకు, 2014లో మంచి హిట్ చిత్రాలను అందించిన 14రీల్స్ అధినేతలకు, కొర్రపాటి సాయి, శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ అధినేతగారికి ధన్యవాదాలు. ముఖ్యంగి ఈ ఆడియోలను ఇంతటి ఘన విజయాన్ని అందించిన శ్రోతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు సంక్రాంత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా సంస్ధ ద్వారా రాబోయే చిత్రం అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ‘బందిపోటు’సంక్రాంత్రి పర్వదినాన రిలీజ్ చేస్తున్నాం’’అన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.